భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వరకు పెరుగుతున్న వరద ఉధృతి!

భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వరకు పెరుగుతున్న వరద ఉధృతి!

 

భద్రాచలం నుంచి కూనవరం,పోలవరం,ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ (SAC) బ్యారేజ్ వరకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది …..

 

 

భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 40.40 అడుగులు ఉండగా , ప్రవాహం 8.19 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఉదయం 10 గంటలకు నీటిమట్టం 41.20 అడుగులకు చేరుకొంది , ప్రవాహం 8.57 లక్షల క్యూసెక్కులకు పెరగగా… మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 41.80 అడుగులు, ప్రవాహం 8.80 లక్షల క్యూసెక్కులకు చేరింది.

 

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో పోలవరం వద్ద కూడా ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటలకు 7.04 లక్షల క్యూసెక్కులుగా ఉన్న డిశ్చార్జ్… మధ్యాహ్నం 12 గంటలకు 7.56 లక్షలకు, మధ్యాహ్నం 3 గంటలకు తాజాగా 7.82 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.

 

ఇదే వరద దిగువకు చేరుతుండటంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారంలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా పేర్కొనగా, వరద ప్రవాహం 8–9 లక్షల క్యూసెక్కుల వరకు చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

 

భద్రాచలం నుండి  కూనవరం, పోలవరం,ధవళేశ్వరం… ఎగువ నుంచి దిగువకు గోదావరి వరద తరంగం నెమ్మదిగా కదులుతోంది…ప్రభావిత ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. ఉప్పొంగుతున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయరాదు. నదిలో స్నానం, ఈత, చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు