9 లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి…

9 లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి…

పోలవరం వైపు ఉద్ధృతంగా జలధార…! గోదావరిలో కొనసాగుతోన్న వరద ప్రవాహం …!!

భద్రాచలం వద్ద  ఈ రోజు రాత్రి 8 గంటలకు నీటిమట్టం 42.80 అడుగులకు చేరగా, ప్రవాహం 9,22,872 క్యూసెక్కులుగా నమోదైంది.

 

అయితే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య నీటిమట్టం 42.70 అడుగుల నుంచి 42.80 అడుగులకు మాత్రమే పెరగడం గమనార్హం.

దిగువన పోలవరం Spillway వద్ద మాత్రం వరద ఉద్ధృతి పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 7,56,006 క్యూసెక్కులుగా ఉన్న డిశ్చార్జి, సాయంత్రం 6 గంటలకు 8,75,512 క్యూసెక్కులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో పోలవరం నుంచి దిగువ గోదావరి వైపు భారీ జలరాశి పరుగులు తీస్తోంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు