ధవళేశ్వరం వద్ద ఉగ్రరూపంలో గోదావరి… 9.70 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు!

ధవళేశ్వరం వద్ద  గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది … 9.70 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు వదిలి పెట

 

 

గోదావరిలో వరద ఉధృతి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం గణాంకాల ప్రకారం బ్యారేజీకి 9,66,322 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మొత్తం 9,71,311 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఇందులో 9,69,911 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు వెళ్తుండగా, కాలువలకు 1,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
అయితే ఎగువన పోలవరం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 9,76,452 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, మధ్యాహ్నం 3 గంటలకు 9,39,418 క్యూసెక్కులకు, తాజాగా సాయంత్రం 6 గంటలకు 9,02,031 క్యూసెక్కులకు తగ్గింది. స్పిల్‌వే ఎగువ నీటిమట్టం +33.000 మీటర్లు, UCD ఎగువ నీటిమట్టం +33.100 మీటర్లుగా నమోదైంది.
ఇది ఇలా ఉంటే భద్రాచలం వద్ద కూడా వరద ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. ఆదివారం రాత్రి 9 గంటలకు 42.80 అడుగులు, 9,22,872 క్యూసెక్కులు ఉండగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 38.40 అడుగులకు చేరగా 7,36,650 క్యూసెక్కులకు తగ్గింది.భద్రాచలం నుంచి పోలవరం వరకు వరద తగ్గుముఖం పట్టినా… ఎగువ నుంచి వచ్చిన భారీ జలరాశి ప్రభావంతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు