తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి..
కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాలని, అక్టోబర్ 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని, ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది.
అదే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం, పులిచింతల బ్యాక్వాటర్పై నిర్మించనున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండా ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలను అడ్డుకోవాలని లేఖ ద్వారా కోరారు.
ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా 811 టీఎంసీల కృష్ణా నదీ జలాల్లో, ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.
Post Views: 15









