🔷 ఉపాధి పేరుతో నమ్మించి తీసుకెళ్లి తెలంగాణ యువతను రష్యా సైన్యంలో చేరుస్తున్న బ్రోకర్లు…?
నెలకు రూ.2 లక్షల జీతం ఇప్పిస్తామని,ఉపాధి పేరుతో గార్డెనింగ్ పనులంటూ నమ్మించి రూ.3 లక్షలు వసూలు చేసి తెలంగాణకు చెందిన నలుగురు యువకులను ఏజెంట్లు రష్యా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది . రష్యా చేరగానే పాస్పోర్టులు, ఫోన్లు లాక్కుని 12 గంటల ప్రయాణం తర్వాత మిలిటరీ క్యాంపులకు తరలించి, బలవంతంగా ఆర్మీ యూనిఫారాలు తొడిగి ఆయుధ శిక్షణ ఇచ్చారని, యువకుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం రష్యా ఆక్రమిత దోనెత్సక్ సరిహద్దుల్లో ఉన్నారు. కాపాడండి అంటూ వారు పంపిన ఆడియో సందేశాలు కుటుంబ సభ్యులకు అందాయి.తమ బిడ్డల ప్రాణాలను కాపాడి సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని బాధితుల కుటుంబాలు కేంద్ర విదేశాంగ శాఖను, తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి…
Post Views: 10









