గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC17’ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్‌లో సరికొత్త సంచలన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దసరా పండగ కానుకగా అక్టోబర్ 16 నుంచి 20 తేదీల మధ్య ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మేకర్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేశారు. ‘పెద్ది’ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనుండగా, ఈ ఏడాది చివర్లోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిత్ర యూనిట్ రూపొందించిన పక్కా ప్రణాళిక ప్రకారం కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్ట్ చిత్రీకరణను పూర్తి చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించి, 2027 చివరినాటికి లేదా 2028 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.









