టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న హనుమ రెడ్డి యక్కంటి పేరు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో వినిపిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది.
కన్నడ స్టార్ యష్‌తో హనుమ రెడ్డి యక్కంటి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యష్‌తో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొనడం సహజమే. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడినట్లు సమాచారం లేదు.
మరోవైపు, ‘డేవిడ్ రెడ్డి’పై మంచు మనోజ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమ రెడ్డి యక్కంటి తదుపరి సినిమా యష్‌తోనే ఉంటుందా? ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









