గరీబ్‌పేటలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 87 వాహనాలపై జరిమానాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు సుజాతనగర్ మండల పరిధిలోని గరీబ్‌పేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో కొత్తగూడెం సబ్‌డివిజన్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 19 త్రిచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 87 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. వాహనదారులు అవసరమైన పత్రాలను కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

అదేవిధంగా తనిఖీల్లో 30 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు