హైదరాబాద్‌లో కొత్తగా 70 వేల మంది ఓటర్ల చేరిక.!

 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SSR) కార్యక్రమంలో భాగంగా కొత్తగా 2.18 లక్షల ఫారం-6 దరఖాస్తులు అందాయి.

అధికారుల పరిశీలన తర్వాత వీటిలో 70,000 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించగా, సరైన పత్రాలు లేని 14,267 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 1.33 లక్షల దరఖాస్తుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది.

నియోజకవర్గాల వారీగా చూస్తే బహదూర్‌పురా నుంచి రికార్డు స్థాయిలో అత్యధికంగా 33,026 దరఖాస్తులు రాగా, సనత్‌నగర్‌లో అతి తక్కువగా 5,781 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

ఇది ఇలా ఉండగా,ప్రవాస భారతీయుల (NRI) విభాగం కింద 4,589 దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 529 మందికి ఓటు హక్కు లభించింది. చిరునామా మార్పులు, వివరాల సవరణల కోసం 1.62 లక్షల వినతులు రాగా.. అందులో 1.19 లక్షల దరఖాస్తులను ఆమోదించి, నిబంధనలకు అనుగుణంగా లేని 17,986 దరఖాస్తులను తోసిపుచ్చారు.

 

ముసాయిదా జాబితాలోని 27.95 లక్షల మంది ఓటర్లలో డోర్ నంబర్ల మ్యాపింగ్ లోపాలు, ఇతర వ్యత్యాసాలు ఉన్న 12.54 లక్షల మందికి నోటీసులు పంపారు. ఇప్పటివరకు నోటీసులు అందుకున్న వారిలో 11.01 లక్షల మంది విచారణ (హియరింగ్)కు హాజరవగా, మరో 1.39 లక్షల మంది పరిశీలన ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.

ఈ పరిశీలనలన్నీ సకాలంలో పూర్తి చేసి, నవంబరు 9వ తేదీన నగర ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.

 

 

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు