22 ఏళ్ల వయసులోనే విషాదాంతం.. దివ్య మృతిపై న్యాయమైన విచారణకు కుటుంబం డిమాండ్

22 ఏళ్ల వయసుకే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల దివ్య జీవితం విషాదాంతం అవటం ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. ఆమె మృతిపై విచారణ చేయాలంటూ దివ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే 

 

 

యాప్రాల్‌కు చెందిన 22 ఏళ్ల గండు దివ్య బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని. డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ అక్టోబర్ 16న మృతి చెందింది. ఈ ఘటనపై న్యాయమైన విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అక్టోబర్ 12న దివ్య, ఆమె సోదరుడు ఈసీఐఎల్‌లోని శ్రీకరా ఆసుపత్రిలో చేరారు. దివ్యకు డెంగ్యూ, సోదరుడికి వైరల్ ఫీవర్‌గా నిర్ధారణ కాగా.. పరిస్థితి నిలకడగా ఉందంటూ అక్టోబర్ 13న ఇద్దరినీ డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అక్టోబర్ 14న దివ్యకు మళ్లీ జ్వరం, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆసుపత్రిలో ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత తీవ్రమైన దురద, వాపు, నల్లటి దద్దుర్లు వచ్చాయని.. పరిస్థితి విషమిస్తున్నా వైద్యులు సరిగా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అక్టోబర్ 15న వైద్యులు స్కాన్ చేయాలని సూచించి, ఫలితాల గురించి వివరించకుండానే వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని సూచించినట్లు తెలిపారు

 

యశోద ఆసుపత్రిలో దివ్య రక్తపోటు సున్నాగా, రక్తంలో చక్కెర స్థాయి 10గా ఉందని.. అవయవాలు దెబ్బతినడంతో పాటు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె బతికే అవకాశం కేవలం 5 శాతమేనని చెప్పినట్లు పేర్కొన్నారు. చివరకు అక్టోబర్ 16న దివ్య కన్నుమూసింది.
సకాలంలో చికిత్స అందించకపోవడం, ఆరోగ్యం విషమిస్తున్న విషయాన్ని పట్టించుకోకపోవడం, పరిస్థితి తీవ్రతను కుటుంబానికి వివరించకపోవడంపై శ్రీకరా ఆసుపత్రి, వైద్యులపై ఫిర్యాదు నమోదైంది. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు