కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ఉంటే తెలంగాణలో కరువు పరిస్థితులు ఉండేవి కావని జగదీష్ రెడ్డి వాదించారు. కృష్ణా జలాలను ఏపీ వినియోగించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం తన వాటా నీటిని సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు…ఈ సందర్భంగా కాంగ్రెస్పై జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం తెలంగాణలో కరెంట్ సరఫరాపై ఆశ్చర్యం వ్యక్తం చేసేవారని గుర్తుచేశారు.
ఇప్పుడు మళ్లీ విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు కరెంట్, నీళ్లు అందించడంపై కాకుండా డబ్బుల దోపిడీ, స్కామ్లు, భూముల వ్యవహారాలపైనే ప్రభుత్వ దృష్టి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసి, ప్రైవేట్ బొగ్గు ద్వారా కమీషన్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ఉంటే తెలంగాణలో కరువు పరిస్థితులు ఉండేవి కావని జగదీష్ రెడ్డి వాదించారు. కృష్ణా జలాలను ఏపీ వినియోగించుకుంటున్నా, తెలంగాణ ప్రభుత్వం తన వాటా నీటిని సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు.కన్నెపల్లి, అన్నారం, సుందిళ్లలో మరమ్మతులు అవసరం లేదని పేర్కొంటూ, ప్రభుత్వానికి చేతకాకపోతే ప్రాజెక్టుల నిర్వహణను బీఆర్ఎస్కు అప్పగించాలని సవాల్ చేశారు. నీటిని ఎత్తిపోసి చూపిస్తామని జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
Post Views: 3









