డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.29.17 లక్షల టోకరా వేసిన ఇద్దరునిందితులను, పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే….
ఢిల్లీ పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ అమీర్పేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. రూ.6.8 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ భయపెట్టి, వెరిఫికేషన్ పేరుతో బాధితుడు, ఆయన కుమార్తె నుంచి రూ.29.17 లక్షలు బదిలీ చేయించుకున్నారు.
ఈ కేసులో అమీర్పేటకు చెందిన మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్, అహ్మద్ నజీబ్ ఉద్దీన్ను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సచిన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మోసపూరిత సొమ్మును మళ్లించి, చెక్కులతో నగదు విత్డ్రా చేసి ఇతర ఖాతాల్లో జమ చేసినట్లు విచారణలో వెల్లడైంది. USDT క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా డబ్బు ఆనవాళ్లు దాచే ప్రయత్నం చేసి, ఈ వ్యవహారంలో కమీషన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు….









