కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఎస్ఐ నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్ఐ నియామ‌క ప్ర‌క్రియ‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందంటూ కొంద‌రు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేర‌కు నియామక ప్రక్రియపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించ‌డం జ‌రిగింది. ఈ స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.

 

ఎస్ఐ నియామక ప్రక్రియలో ఎత్తు కొలిచే విధానంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ఎస్ఐగా పనిచేసిన అభ్యర్థిని కూడా ఎత్తు సరిపోలేదంటూ పక్కకు తప్పించారని ఆరోపిణ చేయ‌డం జ‌రిగింది. దీనిపై అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.

 

దీంతో అభ్యర్థుల ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రతి అభ్యర్థిని హైకోర్టుకు రావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం జ‌రిగింది. దీనికి అనుగుణంగా అందరి అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావన్ కుమార్ ప్రమాణ పత్రం పిటిషనర్ల తరపున దాఖలు చేశారు. దీంతో పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు