కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. …సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తహసిల్దార్ కు వినతి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 28
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలో గత రెండు, మూడు రోజులుగా పెట్రోల్ కొరతతో వాహన వినియోగదారులు, వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి,పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు డిమాండ్ చేశారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ కొరత నివారించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మండల తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వరరావు కు వినతి పత్రం అందించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు చర్యలు చేపడతామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంబి నర్సారెడ్డి,గడ్డం స్వామిలు మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలోని పలు పెట్రోల్ బంకు యజమానులు “నో స్టాక్ బోర్డులు” పెడుతున్నారని కొన్ని బంకుల వద్ద వందలాది వాహనాలు బార్లు తీరి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో పాలకులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని, అన్ని చర్యలు చేపడుతున్నామని ప్రగల్బాలు పలకడం సోచనీయమన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా జిల్లా కలెక్టర్ గారు పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రకటన చేయడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేకుంటే పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడతాయని ప్రశ్నించారు. అదేవిధంగా వంట గ్యాసు తో పాటు వ్యాపారస్తులకు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం పట్టణంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నకరికంటి నాగరాజు, అజయ్ కుమార్, కుంజా శ్రీనివాస్, ధనకొండ రాఘవయ్య, భూపేంద్ర, సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, బి జె ఎల్ పి దాసు, ముత్తయ్య, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రవీందర్, కొరసా రవి, కారు అడ్డ యూనియన్ నాయకులు సుబ్బారావు, ఖలీలు, భాష్యం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు