భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 28
టుడే 9 ప్రతినిధి.
గిరిజన సంక్షేమ ఇన్స్టిట్యూషన్లలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులు వేసవి సెలవులలో ఇంటి పట్టునే ఉండకుండా సమ్మర్ క్యాంపు లలో ఉత్సాహంతో పాల్గొని మీకు ఇష్టమైన కుట్లు అల్లికలు చిత్రలేఖనం క్రాఫ్ట్ ఆర్ట్స్ శ్రద్ధగా నేర్చుకొని మీలో దాగివున్న ప్రతిభను పదిమందికి తెలిసేలా చేసుకోవాలని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్రాజు అన్నారు.
మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న సమర్ క్యాంపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు వారు ఎంచుకున్న చిత్రలేఖనం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్సింగ్ మరియు కంప్యూటర్ శిక్షణతో పాటు వారిలో దాగివున్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి వారికి ఇష్టమైన అంశాలను తప్పనిసరిగా నేర్పించాలని అన్నారు. కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్లో వివిధ రకాల చిత్రాలతో పాటు దానికి సంబంధించిన వర్డ్స్ కూడా నేర్పించాలని అన్నారు. అలాగే బాలికలకు డాన్సింగ్ ఇతర భరతనాట్యాలతో పాటు కుట్లు అల్లికలు కూడా అర్థమయ్యేటట్లు ఫ్యాకల్టీలు నేర్పించాలని అన్నారు. సమ్మర్ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఎండలో తిరగకుండా మీరు ఏ కోర్సును ఎంచుకుంటారో దానిని శిక్షకులు అందిస్తున్న అంశాలను క్షుణ్ణంగా గమనించి అర్థం కాకపోతే మరల అడిగి తెలుసుకుని సరదాగా నేర్చుకొని పరిణితి చెందాలని అన్నారు. సంబంధిత శిక్షకులు విద్యార్థినీ విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల యొక్క కదలికలు గమనించాలని అన్నారు.
అనంతరం కంప్యూటర్ మరియు చిత్రలేఖనం, డ్యాన్స్ క్లాసులను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులకు కొన్ని సూచనలు ఇస్తూ వివిధ కోర్సులలో15 రోజులపాటు అందించే ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా ప్రతి అంశం నేర్చుకోవాలని అన్నారు.
అనంతరం సమ్మర్ క్యాంపుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సమ్మర్ క్యాంపులో విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను ఇంకా పెంచాలని హెచ్ఎంకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమేష్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, హెచ్ఎం సుభద్ర, శిక్షకులు సుజాత, నాగలక్ష్మి, మహాలక్ష్మి, ఆమని విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









