కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఆమె ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేశారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమెకు ఇది తొలి పుట్టినరోజు కావడం, అలాగే చాలా కాలం తర్వాత సమంత తన అభిమానులతో నేరుగా సమయం గడపడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.

అభిమానుల మధ్య ఎంతో ఆనందంగా కనిపించిన సమంత, వారితో సరదాగా మాట్లాడుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన తర్వాత అభిమానులతో ఆమె ఇలా మమేకం కావడం పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సమంతకు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నయనతార, వరలక్ష్మి శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు తారలు ఆమెకు విషెస్ తెలిపారు. ఇదే సమయంలో సమంత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ కామెడీ చిత్రం ‘మా ఇంటి బంగారం’ మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు