కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఘనంగా గోదావరి నదిహారతి..

 

భద్రాచలం మే 31
టుడే 9ప్రతినిధి

అధిక జేష్ట మాసం విభువన సంకష్టహర చతుర్థి పౌర్ణమి రోజు గోదావరి మాత నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని రామ వజ్జల రవికుమార్ అన్నారు.

ఆదివారం నాడు శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో ప్రతి ఆదివారం గోదావరి నదికి భక్తుల సహాయ సహకారాలతో భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు. విభూవన సంకష్టహర చతుర్థి పౌర్ణమి ఆదివారం రోజు నిర్వహించే నదిహారతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పురోహితులు గోదావరి హారతి విశేషాలను విశిష్టతను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులుశ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు. ఆనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, రామాచారి అండ్ సన్స్ ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం నైవేద్యం భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, పూజా ద్రవ్యాలు భద్రాచలం రెడీమేడ్ షాప్ సంఘం ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ వర్మ, కృష్ణమాచార్య, కారంబరీ కృష్ణ శర్మ, రామాచార్యులు, తేజ శర్మ, సాయిలు స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు