- ఐటీడీఏలో అంగరంగ వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఐటీడీఏ పిఓ
- గిరిజన సమగ్ర అభివృద్ధికి ఐటీడీఏ కృషి.పిఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం జూన్ 2
టుడే 9 ప్రతినిధి
సుదీర్గ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణను 29వ రాష్ట్రంగా సాదించుకొని 12 వసంతాలు పూర్తిచేసుకుని 13వ వసంతంలోకి చేరుకోవడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. మంగళవారం నాడు ఐటిడిఏ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, అమరవీరుల స్తూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహం కు పూజలు జరిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేసి, ఐటీడీఏ యూనిట్ అధికారులకు, సిబ్బందికి జాతీయ పతాక ఆవిష్కరణకు వచ్చిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మీడియా మిత్రులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాది కొత్తగూడెం జిల్లా ఏజన్సీ ప్రాతంలోని ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్యా, వైద్యం ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు సాగు నీరు, త్రాగు నీరు, స్వయం ఉపాది తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందున ఎంతో సంతోషిస్తున్నానని ఆయన తెలుపుతూ, మరి ఒకసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.
అనంతరం ఐటీడీఏ ద్వారా ఆదివాసి గిరిజన గ్రామాలలోని ప్రజలకు మరియు ఆశ్రమ పాఠశాల గురుకులాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి వివరించారు.
గిరిజన విద్య. సంక్షేమం…. పాఠశాలలు విద్యార్థుల నమోదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు 50, ప్రభుత్వ గిరిజన వసతి గృహాలు 14, ప్రభుత్వ గిరిజన వికాసం పాఠశాల 01, కళాశాల వసతి గృహాలు మరియు 22. ప్రభుత్వ గిరిజన ప్రాదమిక పాఠశాలలు 219 మొత్తం 306 విద్య సంస్థలలో 24345 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నాడు.
ఉద్దీపకం 2 వర్క్ బుక్స్. ప్రాదమిక పాఠశాల స్థాయి విద్యార్థుల నైపుణ్యం పెంపుదల కొరకు నిపుణులైన ఉపాద్యాయులతో ఉద్దీపకం (గణితం మరియు ఆంగ్లము సబ్జెక్టులలో) వర్క్ బుక్స్ తయారు చేసి విద్యార్ధులకు సులభ రీతిలో అర్ధం అయ్యేలా చెప్పడం కొరకు ఉపాద్యాయులకు శిక్షణ ఇచ్చి ప్రతి ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్ధికి ఉద్దీపకం అందించడం జరిగినది మరియు ఉద్దీపకం వర్క్ బుక్-3 కొన్ని రోజులలో అందుబాటులోనికి రానున్నది.
10వ తరగతి విద్యార్ధులకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష.
2026 ఐటీడీఏ స్థాయిలో ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష-2026 ప్రతిభా పరీక్షను నిర్వహించేందుకు ప్రతి ఆశ్రమ మరియు గురుకులం పాఠశాలలోని (05) 10వ తరగతి విద్యార్ధుల చొప్పున మొత్తం 404 మంది మెరిట్ విద్యార్ధులకు 05.02.2026 నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు పరీక్ష కేంద్రములలో నిర్వహించడం జరిగినది.
పదవ తరగతి విద్యార్ధుల ఫలితములు.
2025-2026 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాదించడం కొరకు ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారులను కేటాయించి నిరంతరం పర్యవేక్షించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు అయ్యే వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ మెనూ, గ్రాఫ్, మ్యాప్ పాయింటింగ్ నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, మెటల్ స్కిలు, ఎక్సామ్ ప్యాడ్, జామెట్రి బాక్స్ అందించనైనది. 2025-26 సంవత్సరంలో (2226) పదవ తరగతి విద్యార్థులకు గాను (2023) మంది పదవ తరగతి విద్యార్థులు (90.88%) ఉత్తీర్ణత సాదించడం జరిగినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు (19) గిరిజన విద్యా సంస్థలు 100% ఉత్తీర్ణత సాదించడం జరిగినది.
> 2025-2026 విద్యా సంవత్సరంలో గురుకులం మరియు ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్, డిగ్రీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన (73) మంది గిరిజన విద్యార్థిని, విద్యార్ధులకు ప్రత్యేకంగా సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు పిల్లల తల్లి తండ్రుల సమక్షంలో అందజేయడం జరిగినది.
*క్రీడా పాఠశాలలు. క్రీడా పోటీలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల,
కిన్నెరసాని, పాల్వంచ మండలం. ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల కాచనపల్లి, గుండాల మండలం నందు 480 (240+240) బాల బాలికలు కలరు. ప్రతి సంవత్సరం 5వ తరగతి నందు (40) మంది విద్యార్ధుల చొప్పున బ్యాటరీ టెస్ట్ నిర్వహించి క్రీడా పాఠశాలల నందు ప్రవేశము కల్పించడం జరుగుచున్నది. ఏటూరునాగరము నందు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు-2025-2026 నందు ఐటిడిఏ భద్రాచలం జోన్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాదించడం జరిగినది.
గిరిజన గురుకుల విద్యాలయాల సంక్షిప్త ప్రగతి నివేదిక.
ఐటిడిఏ పరిధిలో గిరిజన గురుకుల విద్యాలయాలు మొత్తం -32 (భద్రాద్రి కొత్తగూడెం-26, ఖమ్మం -6) నడపబడుచున్నవి.
పరిక్ష ఫలితాలు-2026.
పదవ తరగతి: SSC-2025-26 వ విద్యాసంవత్సరంలో 859మంది పరీక్షకు హాజరు కాగా 845 మంది విద్యార్థులు ఉత్తీర్ణతపొంది 98.37% సాధించడం జరిగినది. మరియు TGTWR ప్రతిభా కళాశాల, ఖమ్మం, TGTWURJC (G), వైరా,RS(B),దమ్మపేట, సింగరేణి, తిరుమలయపాలెం(OS) విద్యాలయాలు 100 % ఫలితాలు సాధించారు.
*EMRS పదవ తరగతి. SSC (CBSE)-2025-26 వ విద్యాసంవత్సరంలో 455మంది పరీక్షకు హాజరు కాగా 454మంది విద్యార్ధిని విద్యార్థులు ఉత్తీర్ణతపొంది 99.78% సాధించడం జరిగినది.
ఇంటర్మీడియట్-11-2026 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 1370మంది పరీక్షలకు హాజరు కాగా 1238మంది ఉత్తీర్ణతపొంది 90.36 % సాధించడం జరిగినది.
స్టేట్ టాపర్స్-2025-26.
ఇంటర్ ద్వితీయ సంవత్సరములో 04 విద్యార్థిని విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో టాపర్స్ గా నిలిచారు.
గిరిజన గురుకుల విద్యార్థిని విద్యార్థుల ప్రతిభ. పెంపోదించిన కార్యక్రమాలు.
IIT/NIT : అడ్మిషన్లు.
2025-26 విద్యా సంవత్సరంలో IIT -12,NIT-07, IIT-4, NEET(Medicine)-7, GFTI మరియు ఇతరములు 06, మొత్తం -36 సీట్లు గిరిజన గురుకుల విద్యార్ధులు కైసవం చేసుకున్నారు.
IIT,NIT, IIIT కోర్సులలో అడ్మిషన్ పొందిన 29 గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు 29 ల్యాప్ టాప్ (Laptop)లను అందజేయడం జరిగినది.
గిరిజన గురుకుల కళాశాల (బాలికలు), భద్రాచలంకు చెందిన విద్యార్థిని తోలెం శ్రీతేజ 2వ HEC, ఆధార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరులో జరిగిన 35వ సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో హాస్తాద్లో (బాలికల)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
PMRC ప్రాజెక్టు మానిటరింగ్ అండ్ రిసోర్స్ సెల్ (విద్య).
1).బడిబాట 2025-26:
2025-26 విద్యా సంవత్సరానికి గాను బడి బాట కార్యక్రమం ద్వారా బడి వయస్సు పిల్లలను గుర్తించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో ప్రవేశములు కల్పించడం కొరకు భద్రాద్రి కొత్తగూడెం. జిల్లాలోని గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జిల్లాలోని 1250 గ్రామాలను 06.06.2025 నుండి 19.06.2025 వరకు సందర్శించి 3707 విద్యార్ధులకు ప్రవేశం కల్పించడం జరిగినది.
2). వివిధ పాఠశాలలకు 74 కంప్యూటర్లు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిదిలోని కొన్ని పాఠశాలలకు పాఠశాల నిర్వహణకు మరియు ఇతర ఆన్లైన్ పనులు దృష్టిలో ఉంచుకొని 74 కంప్యూటర్లను సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగినది.
3)(60) రోజుల యాక్షన్ ప్లాన్ 2025-26
(60) రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఐటిడిఏ పరిధిలో 10వ తరగతి విద్యార్థులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (46) మరియు ఖమ్మం జిల్లాలోని (10) గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజు స్లిప్ టెస్ట్ లు షెడ్యూల్ వారీగా నిర్వహించడం జరుగుతుంది. స్లిప్ టెస్టు షెడ్యూల్పరీక్షలను 22.12.2025 నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
4). SSCవిద్యార్థులకు మినిమమ్ లెర్నింగ్ మెటీరీయల్:
2025- 26 విద్యా సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం జిల్లాల SSC ఫలితాల మెరుగుదల కోసం SSC లోని TW ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లలలో చదివే విద్యార్థుల కోసం చక్కటి మినిమమ్ లెర్నింగ్ మెటీరీయల్ను అలాగే సబ్జెక్టు వారీగా సంబందించిన టీచర్లలకు చరవాణి ద్వారా పంపించడం జరిగినది.
5.) తెలంగాణ భాష దినోత్సవం 2025.
ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉండటమే కాక వారి జన్మదినమైన 9 సెప్టెంబర్ ను తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించడం జరిగినది. దీనికి కొనసాగింపుగా గిరిజన సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ గిరిజన విద్య సంస్థల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ఒక నిమిషం వ్యాఖ్యానం, ఏకపాత్రాభినయం, కవితలు/ పద్యాలు/ ఉపన్యాసాలు, నాటిక ప్రదర్శన లు గిరిజన భవనం, ITDA భద్రాచలంలో ది: 16.09.2025రోజున నిర్వహించడం జరిగినది. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందించడం జరిగినది.
6.) ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష -2026 (PPP).
2025-26 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం.ఖమ్మం జిల్లాల పరిధిలోని TW సంస్థలు, వసతి గృహాలు మరియు గురుకులాలకు చెందినమొత్తం 404 మంది విద్యార్థులకు అనగా ప్రతి సంస్థ నుండి SSCలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 5 మంది విద్యార్థుల చొప్పున, 05.02.2026 తేదీన ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ITDA స్థాయి “ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష-2026″ను నిర్వహించడం జరిగింది.
7.) 10వ తరగతి పరీక్ష ఫలితాలు.
2025-26 విద్యాసంవత్సరంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలల నుండి 2030 గాను 2,025 మంది విద్యార్థులు, వసతి గృహాల నుండి 171 మంది విద్యార్ధులు. BAS నుండి 30 మంది విద్యార్థులు మార్చి-2026 లో జరిగి SSC రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 2,226 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వడం జరిగినది
*గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం.
గిరిజన భవనములు (2025-26): ఈ పధకం క్రింద 3 గిరిజన భవనములు మంజూరు కాగా వీటి అంచనా విలువ రూ.400.00 లక్షలతో చేపట్టుట జరిగింది. వీటిలో 3 పనులు ప్రారంటే దశ లో ఉన్నవి.
> PM DA-JGUA (2025-26) ఈ పధకం క్రింద ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వ ప్రైమరీ పాటశాలలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు. నూతన టాయిలెట్స్ కొరకు కొరకు రూ.974.54 లక్షలతో 96 పనులు మంజూరు కాగా పనులు ప్రారంభ దశ లో ఉన్నవి.
*వైద్య. ఆరోగ్య విభాగము.
ఐ.టి.డి.ఎ – భద్రాచలం లో గల (30) మండలముల యందు (38) PHC’s- ప్రాదమిక ఆరోగ్య కేంద్రాలు, (392)-SC’s – ఆరోగ్య ఉపకేంద్రాల లో (193) (AAM) ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చబడినవి, (5) – UPHC’s పట్టణ ఆరోగ్య కేంద్రాలు, (4) UFWC’s యూ.ఎఫ్.డబ్లు.సీ లు, (9) – CHC’s- కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, (1) -AH’s – ప్రాంతీయ ఆసుపత్రులు, (1) GGH- ప్రభుత్వ సాదారణ ఆసుపత్రి కలవు. (1) Med. Collage ప్రభుత్వ వైద్య కళాశాల, వీటి ద్వారా ఆరోగ్య సేవలు మరియు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయడం జరుగుచున్నవి. అవి ఈ క్రింది విధంగా కలవు.
1). Pre Fabricated Health Centers: 2.໖.4.2 – 2005 (6) ప్రీ ఫాబ్రికేటేడ్ కంటైనర్ హెల్త్ సెంటర్స్ ను ప్రారంభించడం జరిగినది. ఇవి ప్రత్యేకంగ గిరిజిన మారుముల అటవీ ప్రాంతంలో స్తాపించినారు. ప్రాదమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో గల మర్కోడు గ్రామం, గుండాల పరిదిలో గల ముత్తాపురం, పర్ణశాల పరిదిలో గల ఎం. కాసినగరం, వినాయకపురం పరిదిలి లో వినాయకపురం గ్రామం, ఖమ్మం జిల్లా లో గల ప్రాదమిక ఆరోగ్య కేంద్రం అయిన గంగారం పరిది లో గల చంద్రాయపాలెం.సింగరేణి పరిది లో రెలకాయలపల్లి గ్రామం.
జన భాగిదారి అభియాస్.
ఈ కార్యక్రమంలో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 ఏజెన్సీ మండలాలో గిరిజన. కొండరెడ్డి తెగలు గల 131 గ్రామాలలో ఈ నెల 18 వ తారీకు నుండి 25వ తారీకు వరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.
అందులో భాగంగా 131 గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి 3402 మందికి సికిల్ సెల్ క్లీనింగ్, టీబీ స్క్రీనింగ్ చేసి పదిమందికి ఆరోగ్య భద్రత కార్డులు అందించడం జరిగిందని అలాగే రచ్చబండ ఏర్పాటు చేయడం పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయడం, గ్రామ సభలు నిర్వహించడం, ర్యాలీలు. అవగాహన కార్యక్రమాలు, మైక్ ప్రచారం, సోషల్ మీడియా.డిజిటల్ ప్రచారం చేయడంతో పాటు 19 మండలాలలోని 131 గ్రామాలలో గ్రామసభలు మరియు 393 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గిరిజనులు. కొండ రెడ్ల కుటుంబాలు కలిపి 16,920 హాజరు కాగా 2545 మంది దరఖాస్తులు చేసుకున్నారని, దీనిలో భాగంగా రచ్చబండలో 1592 దరఖాస్తులు పరిష్కరించగా 953 దరఖాస్తులు అధికారుల దగ్గర పరిశీలనలో ఉన్నవి.
*ఇందిరమ్మ ఇండ్లు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం (5) అసెంబ్లీ నియోజక వర్గాలలో గిరిజనుల కొరకు మొత్తం (5024) ఇండ్లను మంజూరి చేయడం జరిగినది.
నియోజకవర్గాల వారీగా అస్సరావుపేట 1274 ఇండ్లు కేటాయించగా 1134 మందికి మంజూరు చేయడం జరిగిందని దీనిలో 1505 కొండ రెడ్ల కుటుంబాలు 979 ఇతర గిరిజనుల కొరకు, భద్రాచలం నియోజకవర్గం లో 1000 కేటాయించగా 1000 మందికి మంజూరు చేయడం జరిగింది, పినపాక నియోజకవర్గంలో వెయ్యి ఇండ్లకు గాను 770 మందికి, ఇల్లందు నియోజకవర్గంలో 1000 మందికి గాను 935 మందికి, వైరా నియోజకవర్గంలో 750 మందికి గాను 556 మందికి మంజూరు చేయడం జరిగింది.
సంబందిత గిరిజన గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి Assistant Engineer (Housing) ద్వార సర్వే చేయడం జరిగినది. ఐ.టి.డి.ఏ. భద్రాచలం కార్యాలయం నందు ట్రైబల్ హోసింగ్ మానిటరింగ్ యూనిట్ ను నెలకోల్పి దీని ద్వారా పనుల నాణ్యత మరియు పురోగతిని పరిశీలించి పనులు త్వరిత గతిన పూర్తి చేయడం జరుగుతుంది.
కొండరెడ్డి గ్రామాలలో పూర్తి స్థాయిలో పక్క ఇండ్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకముగా ఇంటి ఇంటి సర్వేను ఎనిమిది కొండారెడ్డి అవాసాలలో నిర్వహించి, అట్టి సర్వే ప్రకారం (163) కుటుంబాలకు పక్క ఇండ్లను రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు పథకం. PMJANMAN ద్వారా మంజూరీ చేయాలని నిర్ణయించడం జరిగినది.
*అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006
> ROFR చట్టం ప్రకారం, పోడు పట్టా కొరకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లు అటవీ శాఖకు ధృవీకరణ కోసం (1450) ప్రతిపాదనలు పంపడం జరిగినది.
*స్కిల్ డెవలప్ మెంట్ (నైపుణ్య అభివృద్ధివిభాగం) ప్రగతి నివేధిక 2025-2026
> ఐ.టి.డి. ఎ. భద్రాచలం గిరిజన యువత శిక్షణ కేంద్రములో గెస్ట్ సర్వీస్ అసోసియేట్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్ మరియు కంప్యూటరు హార్డ్వేర్ కోర్పు లో (105) మంది యువతకు ఉచిత శిక్షణను అందించి (90) మందికి ప్రైవేటు కంపెనీలలో ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే ప్రస్తుతం సెక్టార్ స్కిల్ కొన్సిల్ ద్వారా డొమెస్టిక్ ఐటి హెల్పడెస్క్ అటెండెంట్ కోర్సు లో (35) మంది, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సు లో (30) మంది శిక్షణ లో ఉన్నారు. అలాగే యువత శిక్షణ కేంద్రం ఇల్లందు నందు వేర్ హౌస్ అసోసియేట్ కోర్సు లో (30) మంది శిక్షణ లో ఉన్నారు.
> ఐ.టి.సి ప్రదమ్ ద్వారా భద్రాచలంలో బ్యూటీషియన్ కోర్సు లో (68) మంది ఐ.టి.సి ప్రదమ్, బూర్గంపహాడ్ లో అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ (124) మంది యువతకు ఉచిత శిక్షణను అందించి (157) మందికి ప్రైవేటు కంపెనీలలో ఉపాది కల్పించడం జరిగింది.
> స్వయం ఉపాది శిక్షణలో భాగంగా యువత శిక్షణ కేంద్రం భద్రాచలం నందు ఆర్ సి టి. ఖమ్మం ద్వారా ఉమెన్ టైలరింగ్ లో (33) మంది మరియు ఫోటో గ్రఫీ & వీడియో గ్రఫీ లో (23) మంది, వరుణ్ మోటార్స్ ద్వారా లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లో (48) మంది, ZSTC వరంగల్ ద్వారా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లో (25) మంది, Ni-MSME ద్వారా హనీ బీ కీపింగ్ లో (20) మంది యువతకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే గిరిజన యువత శిక్షణ కేంద్రం భద్రాచలం నందు అప్పారెల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా సిల్ఫ్ ఎంప్లాయ్ ట్రైలర్ కోర్సు లో (60) మంది మహిళలు ప్రస్తుతం శిక్షణ లో ఉన్నారు.
> భద్రాచలం యువత శిక్షణ కేంద్రంలో (3) జాబ్ మేళాలు నిర్వహించి (22) మంది యువతకు హైదరాబాద్ ప్రైవేటు కంపెనీలలో పదివేల నుండి పదిహేను వేల రూపాయల వేతనంతో నేరుగా ఉపాది కల్పించడం జరిగింది.
*అసిస్టెంట్ టూ ఐ.టి.డి.ఏ గ్రాంట్ (జూన్-2026)
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న (96) మంది గిరిజనవిద్యార్ధులకు రూ.28.00 లక్షల ఖర్చు చేసి వివిద రూపములలోవారికి ఆర్ధిక సహాయం చేయడం జరిగినది
పెనుబల్లి మండలం వి.ఎం బంజర్ గ్రామానికి చెందిన బి. మోత్ కుమార్ అనే గిరిజన యువకుడు ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్కు వరకు వెళ్లి గిరిజనుల సంక్షేమం కొరకు ఐటీడీఏ, భద్రాచలం గిరిజన ప్రాంత అభివృద్ధిలో సంస్కృతిని భద్రపరిచేందుకు అత్యాధునిక గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయటం, గిరిజన ఉత్పత్తుల కోసం ‘భద్రగిరి మార్ట్ ‘సృష్టించి, వారిని వ్యాపారులుగా మార్చడం, విద్య, వైద్యం, సాగు. తాగునీటి సౌకర్యాల కల్పనలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన విషయాలపై ఫ్లెక్సీ. వీడియో సందేశం ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారి ఇంతటి అరుదైన సందేశం ఐటీడీఏ, భద్రాచలం దక్కడం విశేషం.
గిరిజన మ్యూజియం
ఐటిడిఏ ప్రాగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి సందర్షుకుల రాక గణనీయంగా పెరుగుతుందని గత సంవత్సరం శ్రీరామ నవమి రోజు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ తో ప్రారంభించడం జరింగింది. ఏజన్సీలోని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వేషధారణకు సంబందించిన పరికరాలు పనిముట్లతో పాటు బాక్సు క్రికెట్, చిన్నారులకు బోటింగ్, సెల్సి పాయింట్ ఆబాల గోపాలాన్ని ఆసక్తి కలిగించే ఆటవస్తువులు గిరిజన వంటకాల రుచులు పర్యాటకులను విశేషంగా ఆకట్టు కొంటున్నాయి. ఇప్పటి వరకు 1,95,000 మంది సందర్శకులు మ్యూజియంను సందర్శించారు.
అలాగే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పర్యాటకుల వారోత్సవాల సందర్భంగా హైద్రాబాదు లోని శిల్పారామంలో జరిగిన పర్యాటక దినోత్సవం నాడు ట్రైబల్ మ్యూజియంనకు బెస్ట్ అవార్డ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగినది.
మ్యూజియంను అత్యంత ఆధునిక హంగులతో రూపొందించడానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపగా తాజ్ బంజారా హోటల్ హైదరాబాదు నందు జరిగిన సెమినార్లో ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగినది. వీటితో గిరిజన మ్యూజియం అభివృద్ధి కొరకు త్వరలో పనుల ప్రాంభించి పర్యాటకులను భక్తులను కనువిందు కలిగేలా ముస్తాబు చేయడం జరుగుతుంది.
*కోయ ఇలవేల్పుల చరిత్ర
ఆదివాసీలలో కోయతెగకు చెందిన కొన్ని వేల సంవత్సరాల నుండి కుల దైవాలైన ఇలవేల్పులను జాతరలు పండుగల రూపంలో కొలుస్తున్నారు. ఈ విషయం బాహ్య ప్రపందానికి తెలియదు. ప్రస్తుతము ఐ.టి.డి.ఏ. భద్రాచలం తరపున కోయ ఇలవేల్పుల పరిశోదకులు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు, తలపతులు, అర్తి బిడ్డలు (డోలీలు)తో ఒక బృందం ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం జరిగినది. దీనిలో భాగముగా ప్రధమంగా (142) కోయ ఇలవేల్పులను వివరాలను సేకరించి తేది. 10.04.2026 నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) మరియు ఆదివాసీ ప్రతినిధుల సమక్షంలో కోయ ఇలవేల్పుల పుస్తకమును ఆవిస్కరించడం జరిగినది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నందుకు గౌరవ సూచకంగా నాకు ఆదివాసీ ప్రతినిధులు “ఆదివాసి వికాస రత్న” బిందు ప్రధానం చేయడం జరిగినది. దీనికిగాను ఆదివాసీ ప్రతినిధులకు ప్రత్యేకముగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
*భద్రగిరి మార్ట్.
భద్రాచలం మార్కెట్ సెంటర్ నందు భద్రగిరి మార్ట్ నాణ్యమైన, దేశీయ. సేంద్రియ ఉత్పత్తులను సాధారణ వినియోగదారులకు చేరువ చేస్తూ, స్థిరమైన జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో 28.03.2026 నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. భద్రాచలం. దాని చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాల గిరిజన స్వయం సహాయక సంఘాల (SHG) మరియు MSME JLG గ్రూపుల ద్వారా తయారయ్యే ఉత్పత్తుల విక్రయానికి శాశ్వత వేదికను ఏర్పాటు చేసి దీని ద్వారా గిరిజన ఎస్ హెచ్ జి.ఎం ఎస్ ఎం ఈ లను నేరుగా మార్కెటింగ్, మధ్యవర్తుల తొలగింపు, ఉత్తమ ధర లభ్యత కలుగుతుంది. దీనివల్ల మహిళా సాధికారత, గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలగజేయడం అయినది.
శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునే భక్తులు పర్యాటకులు మరియు భద్రాచలం చుట్టుపక్కల ప్రజల ఆదరణతో భద్రగిరి మార్ట్ దిగ్విజయంగా కొనసాగుతున్నది.
గిరిజన సహకార సంస్థ.
* గిరిజన సహకార సంస్థ, భద్రాచలం నందు (5) సొసైటీలు కలవు. అవి:1) దద్రాచలం 2) పాల్వంచ,3 ) ఇల్లందు,4) దమ్మపేట మరియు 5) మణుగూరు.
* డివిజన్ పరిధి లో 113 డి.ఆర్. డిపోలు. 36 సబ్ డిపోలు, పసుపు కారం శుద్ధి కర్మాగారం మరియు పెట్రోల్ బంకులు 7 ద్వారా గిరిజన కార్డు హోల్డర్ల కు, గిరిజన సంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుచున్నది.
ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక 13 వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కల్గినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, పి వి టి జి అధికారి గన్యా, ఏపీ ఓ పవర్ వేణు, ఏటీడీవో పీసా అధికారి అశోక్, ఏడీఎంహెచ్వో సైదులు, ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఆర్టీవో వెంకట పుల్లయ్య, ఏవో సున్నం రాంబాబు, ఎల్ టి ఆర్ డి టి మణిధర్, ఏసీఎంఓ రమేష్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, జేడీఎం హరికృష్ణ, సిడిపిఓ రాజకుమారి, మేనేజర్ ఆదినారాయణ. ఐటిడిఏ కార్యాలయం విభాగంలోని అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.









