- రాజ్యాంగ నిర్మాతకు అవమానం.. పట్టించుకోని పాలకులు.
- ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.
- రాజ్యాంగ అందించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు తెలంగాణలో రక్షణ కరువు.
- అశ్వాపురంలో అంబేద్కర్ విగ్రహం తొలగించడంపై అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వారి వైఖరి తెలియజేయాలి.
- మాల జన సమితి అధ్యక్షుడు చెట్టి సురేష్ డిమాండ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. అశ్వాపురం జూన్ 2
టుడే 9 ప్రతినిధి
అశ్వాపురంలో మాల జన సమితి అధ్యక్షుడు చెట్టి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా అశ్వాపురంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన జరిగిన అవమానానికి అధికారులు ఎవరు స్పందించకపోవడం చాలా బాధగా ఉందని రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైందని వాపోయారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా ఎంతోమంది పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అటువంటి తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో రోడ్డుపై ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్ అండ్ బి అధికారులు అత్యంత పాషవికంగా తొలగించి పక్కన పడేసారని, ఈ విషయాన్ని మాల జన సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, విగ్రహం తొలగించి ఇన్ని రోజులు అయినా , అదేవిధంగా ప్రతిరోజు నిరసన తెలియజేస్తున్న కూడా సంబంధిత అధికార పార్టీ నాయకులు గానీ, ప్రతిపక్ష నాయకులు గానీ ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోకపోవడం దారుణమైన విషయమని ఆయన అన్నారు, అంతేకాకుండా రాజ్యాంగం ద్వారానే భారత ప్రభుత్వం, భారత న్యాయవ్యవస్థ నడుస్తూ ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగించడం చాలా అన్యాయమని, ఇట్టి విషయంపై స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, . జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వారి వైఖరి తెలియజేయాలని అంబేద్కర్ విగ్రహాన్ని మరలా అక్కడ పున ప్రతిష్టించాలని అప్పటివరకు మా ఉద్యమాలు ఆగమని, లేనిపక్షంలో స్థానికంగా ఉన్న నాయకులకు ఓట్ల రూపంలో మా పనితీరు ఏమిటో చూపిస్తామని తెలియజేశారు, అంబేద్కర్ విగ్రహాన్ని మరలా అక్కడే ప్రతిష్టించాలని లేనిపక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.









