కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం…..

•బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

•భద్రాచలంలో ఈసారి బిఆర్ఎస్ జెండా రెపరెపలు. రావులపల్లి

•కెసిఆర్ సారే మళ్ళీ రావాలి. మానే రామకృష్ణ.

భద్రాచలం జూన్ 2: Today 9 ప్రతినిధి

భద్రాచలంలో  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గులాబీ దళం ప్రదర్శించిన భారీ శక్తికి అద్దం పట్టాయి.
ఉద్యమ పురిటిగడ్డపై రెపరెపలాడిన గులాబీ జెండా, తెలంగాణ పోరాట పటిమను మరోసారి చాటిచెప్పింది.
నిప్పులు చెరిగే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించగా, భద్రాద్రి వీధులన్నీ గులాబీమయంగా మారాయి.
రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ చూపిన తెగువను స్మరించుకుంటూ, నాయకులు కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రతి అడుగులోనూ పోరాట వారసత్వాన్ని మోస్తున్న గులాబీ శ్రేణులు, తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని నాయకులు పదునైన శపథం చేశారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి బిఆర్ఎస్ అని ఈ వేడుకలు నిరూపించాయి.
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే, రాబోయే రాజకీయ పోరాటాలకు ఇక్కడే పునాది పడిందని అర్థమవుతోంది.
నేటి ఈ సంబరాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, బిఆర్ఎస్ సత్తాను చాటిచెప్పాయి.
ఉద్యమ కసి.. నాయకత్వం పట్ల నిబద్ధతతో భద్రాచలంలో బిఆర్ఎస్ శ్రేణులు సరికొత్త రికార్డు సృష్టించాయి

*బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు.

భద్రాచలం పట్టణంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని బిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో… ఉద్యమ నేత, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మానే రామకృష్ణ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ రాష్ట్ర ఆవిర్భావం నెరవేర్చిన కేసీఆర్ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం దక్కించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో అనే రీతిన ఆనాడు ఆయన చేసిన ఉద్యమ తీవ్రతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కొట్లాడిన తీరు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పటానికి ప్రాణ త్యాగాలు చేసిన అమరుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, బంగారు తెలంగాణ సాధనకు అందరు నడుం బిగించాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా ఈ రాష్ట్ర ప్రగతిని విస్మరించి, కాంగ్రెస్ నేతల బాగు కోసం పనిచేస్తుందని విమర్శించారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం, ఇక్కడి సంపద అంతా దోచి రేవంత్ రెడ్డి కట్టల కట్టల రూపాయలు ఢిల్లీకి పంపటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కెసిఆర్ సారే రావాలని, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని… రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ… భద్రాచలంలో ఈసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఘంటాపదంగా చెప్పారు. అందుకోసం పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రధానంగా యువత బాధ్యత ఎంతో ఉందని తెలియజేశారు. మహిళలు కూడా చేయి చేయి కలిపి రేవంత్ రెడ్డిని గద్దె దింపి సాగనంపే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పన సిద్ధులు, మండల పార్టీ నాయకులు కోటగిరి ప్రమోద్ కుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, ఆకోజు సునీల్ కుమార్, కొల్లం జయకు ప్రేమ్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, ఏడవ వార్డు సభ్యులు కావూరు గోపి, గోసుల శ్రీనివాస్, కావూరి సీతా మహాలక్ష్మి, పూజల లక్ష్మి, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి బీరబోయిన వెంకట నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు,

భారాస లో పలువురు చేరిక

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇంచార్జి రావులపల్లి రాంప్రసాద్ పార్టీ నాయకులు మానే రామకృష్ణ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు…

ఎండి ముంతాజ్ రఫీ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 కుటుంబాలు, రేపాక రోహిత్ ఆధ్వర్యంలో పదిమంది యువకులు పార్టీలో చేరారు..

వీరందరికీ రావులపల్లి రాంప్రసాద్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు