కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  బీజేపీకి అన్నామలై గుడ్‌బై: ‘వి ద లీడర్స్’ ఉద్యమానికి 24 గంటల్లోనే 14 లక్షల మంది మద్దతు

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతోనే తాను బీజేపీతో ఉన్న ఆరేళ్ల ప్రయాణానికి ముగింపు పలికినట్లు ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించిన అనంతరం, తమిళనాడు ప్రజల హక్కుల సాధన కోసం మరియు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఆయన ‘వి ద లీడర్స్’ (We The Leaders) అనే సరికొత్త ప్రజా ఉద్యమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

అన్నామలై ప్రారంభించిన ఈ ఉద్యమానికి సోషల్ మీడియా మరియు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, ఆన్‌లైన్ లింక్ ద్వారా గత 24 ంటల్లోనే దాదాపు 14 లక్షల మంది (13.85 లక్షలు) ఇందులో సభ్యులుగా చేరి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఉద్యమం ద్వారా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతామని, అలాగే 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్తులో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు.

సాంప్రదాయ రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే తరహాలోనే ఇకపై తాను బీజేపీని కూడా చూస్తానని అన్నామలై పేర్కొన్నారు. తమిళనాడు గుర్తింపు, సాంస్కృతిక వారసత్వ విషయాల్లో కేంద్ర అధిష్ఠానంతో తనకు విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ప్రారంభించిన ఈ ఉద్యమానికి బడా పారిశ్రామికవేత్తల నేపథ్యం గానీ, స్టార్‌డమ్ గానీ లేవని.. ప్రజల కోసం పనిచేసే తపన మాత్రమే ఉందని చెబుతూ, శాశ్వత ఎమ్మెల్యేలు మరియు ఎంపీల సంస్కృతికి ముగింపు పలికి సామాన్యులతో కూడిన నూతన రాజకీయ వ్యవస్థను నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు