అంతర్జాతీయ మారకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా… ప్రతిజ్ఞ చేయించిన పీవో …

  • అంతర్జాతీయ మారకద్రవ్యాల
    అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం.
  • హెచ్ఎం వార్డెన్ లతో ప్రతిజ్ఞ.
  • పాల్గొన్న ఐ టి డి పి ఓ బి రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 20
టుడే 9 ప్రతినిధి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వేడుకల సందర్భంగా హెచ్ఎం వార్డెన్ లతో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఈనెల 17 నుండి 26 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం వేడుకలు జరుగుతున్నందున గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణ పై విద్యార్థుల చర్చలు నిర్వహించడం, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పిల్లలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని హెచ్ఎం లకు సూచించారు.
అనంతరం హెచ్ఎం వార్డెన్ లకు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
* ప్రతిజ్ఞ*
నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పములో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని హెచ్ఎం వాటిల్లతో కలిసి ఐటీడీఏ పీవో ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన ఖమ్మం డిడి విజయలక్ష్మి ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ డిఎంజిసిసి సమ్మయ్య ఏసీఎంవోలు హెచ్ఎం వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు