క్షణికా ఆవేశం కాదు.. విచక్షణతో తీసుకునే నిర్ణయాలే మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తాయి… జడ్జి కంబపు సూరిరెడ్డి

 

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికల విభాగంలో మణుగూరు మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన శిబిరం. శిబిరంలో పాల్గొన్న న్యాయ సేవ కమిటీ చైర్మన్ ప్రధమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి . బాలల విద్యా ,భద్రత గౌరవప్రదమైన జీవనం హక్కులని,.. హింస, వేధింపులు, దోపిడీ, వంటి ఘటనలు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందవచ్చునని తెలిపారు. బాలలకు, విద్య, భద్రత,వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరమని, …ఫోక్స్ చట్టం ద్వారా 18 ఏళ్లలోపు బాల బాలికలకు లైంగిక వేధింపుల నుంచి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి. వివరించారు. అవగాహన సదస్సులో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుకృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీరంకి పద్మావతి, న్యాయవాదులు సావిత్రి, నరసింహారావు, భాస్కర్ రావు .కళాశాల ప్రిన్సిపాల్ రాణి, ఎం ఎల్ ఎస్ సి కోఆర్డినేటర్ రవీందర్ రావు లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share