గుర్రం శేషగిరి రావు గారి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను నేతలు ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రిసెప్షన్ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు అందించారు. వేడుక సందడిగా, ఆహ్లాదకరంగా సాగింది.
Post Views: 13









