అధికారులు నిర్లక్ష్యానికి– పల్లె ప్రజలు విలవిల..
— కామేపల్లిలో పడకేసిన పారిశుధ్యం…కంపిస్తున్న పల్లెలు
— పంచాయతీలకు సందర్శించ కుండా మంగళం పాడుతున్న మండల పంచాయతీ అధికారి
— ఇదే అదునుగా చూసుకుంటున్న
పంచాయతీ కార్యదర్శులు
— ఏజెన్సీ అలవెన్సులు పొందుతూ పట్టణాల నుంచే రాకపోకలు
గ్రామ ప్రజల సేవలు శూన్యం
— ప్రభుత్వం నుండి దండిగా ఏజెన్సీలు
అలవెన్సులు గ్రామాల నుండి పొందుతున్న ఉద్యోగులు
— గ్రామంలో స్థానికంగా ఉన్నట్టు ఇంటి నెంబర్ తో గ్రామ కార్యదర్శి నుండి పొందుతున్న
ధ్రువపత్రాలు వివిధ శాఖల ఉద్యోగులు
— జిల్లాలోని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజాసంఘాల డిమాండ్
ఆగస్ట్ 23:-TODAY 9 NEWS..
వర్షాకాలం రానే వచ్చింది.. పల్లెల్లో రోగాలు పంజా విసురుతూనే ఉన్నాయి.. కానీ వాటిని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నిర్లక్ష్యం తో .ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని కామేపల్లి మండలంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గ్రామాలు విష జ్వరాల బారిన పడుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి .
క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఎంపీఓ,తన కార్యాలయానికే కాకుండా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనులకు ఇటు కాంట్రాక్టులు సర్పంచుల బిల్లులు కమిషన్లకు పరిమితం అవుతున్నారంటూ మండల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
పర్యవేక్షణ శూన్యం..
మండల కేంద్రం కామేపల్లితో పాటు రామకృష్ణాపురం, ఊట్కూర్, జోగుగూడెం,తాళ్ల గూడెం,టేకుల తండా, పింజరమడుగు, పాత లింగాల, కొత్తలింగాల, బర్లగూడెం, పొన్నెకల్,ముచ్చర్ల, జాస్తిపల్లి, మద్దులపల్లి కెప్టెన్ బంజర తదితర గ్రామాల్లో ఎక్కడి కక్కడ మురుగు నీరు నిలిచిపోయి, చెత్త కుప్పలు పేరుకుపోయాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . వీధులు దుర్గంధంతో నిండిపోవడం వల్ల జనం ముక్కు మూసుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు .
పంచాయతీ కార్యదర్శులు విధులకు చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని, డ్రైనేజీలను శుభ్రం చేయించే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయాల్సిన ఎంపీఓ కనీసం ఏ ఒక్క గ్రామాన్నీ ఆకస్మిక తనిఖీ చేసిన దాఖలాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి.
ఏజెన్సీ అలవెన్సులు మంజూరు..చేసే సేవలకేమో ఎసరు!
ఏజెన్సీ పరిధిలోని గిరిజన పల్లెల్లో స్థానికంగా నివాసం ఉండాలని ఆదేశం ఉన్నప్పటికీ అధికారులు భే ఖాతరు చేస్తూ పట్టణాల నుంచే రాకపోకలు నిర్వహిస్తూ గ్రామ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.. జిల్లా హెడ్ క్వార్టర్లో నివాసముంటూ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అలవెన్సులు సక్రమంగా పొందుతున్న ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయిలో ఉండటం లేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి . ఖమ్మం ఇతర సమీప పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తూ, అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు కూడా లేకపోలేదు.. కనీసం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించకపోవడంతో జనం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి దోపిడీకి గురవుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు చాల్లేండి .
జిల్లా కలెక్టర్, డీపీఓ స్పందించాలి!
బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంపీఓ మండల అభివృద్ధి అధికారి మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో మండల పంచాయతీ అధికారి పై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా వివిధ గ్రామాల ప్రజలు కుల సంఘాల ప్రజాసంఘాల నాయకులు ప్రతిపక్ష రాజకీయ అనుబంధ సంఘాల నాయకులు వివిధ శాఖల అధికారులను కోరుతున్నారు..









