ఏపీలో వాతావరణం మార్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తీవ్రతరం కావచ్చని, ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share