గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి సమావేశం

గుంటూరులోని మల్లెనేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు, అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గణేశ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో వివిధ జిల్లాల్లో గణేశ ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించడం, ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయ ఆదిత్య, సమితి కార్యదర్శి శ్రీ త్రినాథ్, శ్రీ లక్ష్మీపతి, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లినేని పరమేశ్వరరావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ పుణుగుళ్ల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు