తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియకు కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు

తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో పెరిగిన ఆమె.. భాష, సంస్కృతి పరంగా కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టినా తన నటనతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు తమిళ సినిమాలను డబ్బింగ్ వెర్షన్లలో చూసిన ఆమె.. ఇప్పుడు అదే పరిశ్రమలో నటిస్తూ ప్రశంసలు అందుకోవడం విశేషం.

శ్రీ గౌరీ ప్రియ ప్రయాణం మోడలింగ్‌తో ప్రారంభమైంది. 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టి ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘మ్యాడ్’ సినిమాలో కాలేజీ అమ్మాయి పాత్రతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఇస్తూ తనలోని టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు శ్రీ గౌరీ ప్రియ. తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు స్థానిక భాష, సంస్కృతిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో కోలీవుడ్‌లో ఆమెకు వస్తున్న అవకాశాలు, అక్కడ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share