అనసూయ వ్యాఖ్యలపై దుమారం.. భారతీయ సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణకు సంబంధించిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో తన వ్యక్తిగత జీవితంలోని ఓ సంఘటనను అనసూయ పంచుకున్నారు.

తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి కాటుక, బొట్టు, గాజులు, తలలో పూలు వంటి సంప్రదాయ అలంకరణలకు దూరంగా ఉండటం తనను ఎంతో బాధించిందని ఆమె తెలిపారు. మూడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన అనంతరం తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి తాను కలత చెందానని అనసూయ పేర్కొన్నారు.

మహిళలు తమ వ్యక్తిత్వాన్ని, అందాన్ని, అలంకరణను ఎలా వ్యక్తీకరించుకోవాలనే అంశంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిప్రాయానికి కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. దీంతో అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share