యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక ఈవెంట్‌లో iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లను పరిచయం చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఐఫోన్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఇప్పటికే టెక్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈసారి యాపిల్ మరో కీలక సర్‌ప్రైజ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఇదే వేదికపై ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి యాపిల్ ఎంట్రీ ఇస్తే.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.
ఫోర్బ్స్ కథనం ప్రకారం యాపిల్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు ఫోల్డబుల్ ఐఫోన్ వస్తుందా అనే అంశంపై యాపిల్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.









