మార్క్ జుకర్‌బర్గ్ భారీ AI ప్లాన్.. ఉద్యోగులపై ప్రభావం ఎంతంటే?

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థను పూర్తిగా AI ఆధారిత కంపెనీగా మార్చేందుకు భారీ ప్రణాళిక రూపొందించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా కొన్ని విభాగాల్లో ఏకంగా 60 శాతం వరకు ఉద్యోగాలను తగ్గించి.. ఆ పనులను AI ఏజెంట్లతో చేయించాలని భావించినట్లు సమాచారం. అయితే ఈ ప్రణాళికకు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు, కొన్ని AI వ్యవస్థల వైఫల్యాలు కూడా అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో హవాయిలోని జుకర్‌బర్గ్ నివాసంలో మెటా ఉన్నతాధికారులతో జరిగిన రహస్య సమావేశంలో ‘ప్రాజెక్ట్ OT’ (ఆర్గనైజేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్)కు రూపకల్పన చేసినట్లు సమాచారం. మెటాను ‘AI నేటివ్’ కంపెనీగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్యను 60 శాతం వరకు తగ్గించి.. మిగిలిన సిబ్బందితో AI ఏజెంట్ల పనితీరును పర్యవేక్షించాలని భావించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అదే సమయంలో పాత తరహా మేనేజర్ పోస్టులను తొలగించి.. వాటి స్థానంలో ‘టెక్ పాడ్స్’ ఏర్పాటు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యతిరేకత, AI ఆధారిత వ్యవస్థల పనితీరుపై ఎదురైన సమస్యల కారణంగా ఈ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మెటా భవిష్యత్తులో AIని సంస్థ కార్యకలాపాల్లో మరింత విస్తృతంగా ఉపయోగించనున్నప్పటికీ.. ఉద్యోగులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share