నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు.. ముగ్గురి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

నేపాల్‌లో భారీ వరదల కారణంగా చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. యాత్రికుల భద్రత, ఆచూకీ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఏడుగురు ఏపీ యాత్రికుల్లో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి తెలిపారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వారి ఆచూకీ కోసం నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన ముగ్గురి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ, పరిస్థితిపై నిరంతరం సమాచారం అందించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు