భారత్‌ను చొరబాట్ల రహిత దేశంగా మారుస్తాం: అమిత్ షా

భారత్‌ను అన్ని విధాలుగా సురక్షిత దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్నారు. భారతదేశంలో నివసించే హక్కు భారత పౌరులకే ఉంటుందని పేర్కొన్నారు.

సరిహద్దుల్లో భద్రతా బలగాల కన్నుగప్పి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. అక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి భరతం పడతామని తేల్చి చెప్పారు.

త్వరలోనే భారత్‌ను పూర్తిగా చొరబాట్ల రహిత దేశంగా మారుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఎవరుపడితే వారు వచ్చి నివసించేందుకు భారత్ ధర్మశాల కాదని వ్యాఖ్యానించారు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share