పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రైవేటు బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Post Views: 4









