రాఖీ పౌర్ణమికి 5,000 ప్రత్యేక బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

గతేడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి మరో 240 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రత్యేక బస్సుల్లో సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 2.51 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

పండుగకు ముందు, తిరుగు ప్రయాణాల సమయంలో రద్దీ పెరిగే ప్రాంతాల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share