హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీవోలు నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ నేతలు పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ధర్నా అనంతరం కలెక్టరేట్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వైపు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నేతలు తెలిపారు. సభలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
Post Views: 1









