మోదీ వైపే యువత.. MOTN సర్వేలో ఆసక్తికర ఫలితాలు

ఆగస్టు 2026 మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 326, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. యువతలో ప్రశ్నాపత్రాల లీకేజీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రధాని మోదీ నాయకత్వంపై మద్దతు కొనసాగుతున్నట్లు తెలిపింది.

పరీక్షల నిష్పాక్షికతపై యువతలో తీవ్ర అనుమానాలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 40 శాతం మంది పరీక్షా వ్యవస్థపై నమ్మకం లేదని, మరో 27 శాతం మంది చాలా తక్కువ నమ్మకం ఉందని చెప్పారు. మొత్తంగా 67 శాతం మంది పరీక్షా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయగా, కేవలం 14 శాతం మంది మాత్రమే అది పూర్తిగా నిష్పాక్షికంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నెమ్మదిగా, నమ్మదగినదిగా లేదని 17 శాతం జెన్‌-జీ యువత అభిప్రాయపడింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించగా రిగ్గింగ్, అవినీతిని అరికట్టడంలో వైఫల్యమే ప్రధాన కారణమని 9.8 శాతం మంది పేర్కొన్నారు. గత సర్వేలో ఇదే అభిప్రాయం 1.4 శాతంగా ఉండటంతో యువతలో అసంతృప్తి పెరిగినట్లు సర్వే సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share