స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ.. జనసేన పార్టీ కూడా ఎన్నికలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశమై స్థానిక ఎన్నికల వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని జనసేన నేతలు స్పష్టం చేశారు. యువత, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

‘సిద్ధం’ అన్న వ్యక్తే ఇప్పుడు ‘యుద్ధం’ అంటున్నారని జనసేన నేతలు వ్యాఖ్యానించారు. యుద్ధానికి జనసేన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి జనసేన సత్తా చాటాలని నేతలు కార్యకర్తలకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు