భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు లాడ్జిలో సివిల్ సప్లైస్ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనపై మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు మహిళా ఉద్యోగితో పాటు నలుగురు విలేకరులపై కేసు నమోదు చేశారు భద్రాచలం పోలీసులు.పాల్వంచ గ్యాస్ గోడౌన్లో మేనేజర్‌గా పనిచేస్తూ, మహిళా ఉద్యోగి అవినీతిని నిలదీసినందుకు ఆమె తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిందని ఆవేదనతో అనంతుల లక్ష్మీనారాయణ (57)ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
అయితే, తనపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటే రూ.కోటి ఇవ్వాలని మహిళా ఉద్యోగి రజిత, ఆమె భర్త నాయిని రాజేష్, 10టీవీ రిపోర్టర్ నాగ చందు, బిగ్ టీవీ రిపోర్టర్ వెంకన్న, టీవీ9 రిపోర్టర్ రవి, కలీం తన తండ్రిని వేధించారని లక్ష్మీనారాయణ కూతురు మధులిక పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, మధులిక ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా ఉద్యోగి అవినీతిని అడ్డుకున్నందుకు తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్ గోడౌన్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ అంతర్గత కమిటీతో విచారణకు ఆదేశించారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ నారాయణ ఈ నేపథ్యంలో తన కార్యాలయ వాట్సాప్ గ్రూపులో మరణ వాంగ్మూలం పంపించి, భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.సహోద్యోగుల సమాచారం మేరకు లాడ్జికి చేరుకోగా, అప్పటికే లక్ష్మీనారాయణ మరణించినట్లు పోలీసులు గుర్తించారు.
మహిళా ఉద్యోగి భర్త నాయిని రాజేష్, 10టీవీ రిపోర్టర్ నాగ చందు, బిగ్ టీవీ రిపోర్టర్ వెంకన్న, టీవీ9 రిపోర్టర్ రవి తనను వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతుడు లక్ష్మీనారాయణ.సూసైడ్ నోట్లో పేర్కొన్నారు ఇది ఇలా ఉంటే “మీరు డబ్బు తీసుకోరు.. మమ్మల్ని తీసుకోనివ్వరు” అని ఆ మహిళా ఉద్యోగి తనను ప్రశ్నించేదని తన సూసైడ్ నోట్లో లక్ష్మీనారాయణ పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మృతుల లక్ష్మీనారాయణ కుమార్తె మధులిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 3









