ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF), ఆర్ఎన్‌సీసీ ఖమ్మం టీమ్స్ చౌటుప్పల్ పోలీసులతో కలిసి ఛేదించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో విజయవాడ–ముంబై జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.10.25 లక్షల విలువైన 20.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన కారుతో పాటు మూడు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
అరెస్టయిన నిందితులను ఒడిశాకు చెందిన త్రిలోచన్ సమంత్ర (30), అతని మేనల్లుడు సాగర్ బాల్ (23)గా పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర గంజాయి రవాణాపై నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.









