వరంగల్ కోట అభివృద్ధికి రూ. 382 కోట్లు మంజూరు: కాకతీయ కీర్తికి పూర్వవైభవం.. ప్రపంచ బ్యాంకు నిధులతో మారనున్న నగర రూపురేఖలు!

కాకతీయ రాజవంశ వైభవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక వరంగల్ కోటతో పాటు హనుమకొండ నగర పరిధిలోని పలు కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో విస్తృత మౌలిక వసతుల కల్పన, చారిత్రక కట్టడాల పరిరక్షణ లక్ష్యంగా మొత్తం రూ. 382 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మంజూరైన నిధులతో ఖిల్లా వరంగల్ పునరుద్ధరణ, నగరంలో నూతన సెంట్రల్ ప్లాజా నిర్మాణం, ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు, చారిత్రక వేయి స్తంభాల గుడి పరిసరాల సుందరీకరణ, అలాగే పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక మ్యూజికల్ గార్డెన్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో పర్యవేక్షించనుండగా, అభివృద్ధి పనుల వ్యయానికి ప్రపంచ బ్యాంకు నుంచి సమకూరే నిధులను వినియోగించనున్నారు.
వరంగల్ నగరంలోని అమూల్యమైన చారిత్రక సంపదను భావితరాలకు భద్రంగా అందించడంతో పాటు, నగరంలో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ భారీ అభివృద్ధి పనులు పూర్తి అయితే ప్రపంచ పర్యాటక చిత్రపటంలో వరంగల్ నగరానికి మరింత గుర్తింపు రావడంతో పాటు, స్థానిక పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటాయని భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు