మిల్లెట్ బిస్కెట్ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 14
టుడే 9 ప్రతినిధి
భద్రగిరి మార్ట్ కు సరఫరా చేసే మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు . ఇతర ఆహార పదార్థాలు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఆదేశాల మేరకు భద్రాద్రి శ్రీరామ జాయింట్ లీయాబిలిటీ గ్రూప్ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించడం జరిగిందని సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
గురువారం నాడు సాయంత్రం ఐ టి డి ఏ ప్రాంగణంలోని మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని వారు సందర్శించి బిస్కెట్ల తయారీకి వాడుతున్న ముడి సరుకులను తయారీ విధానాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఏర్పాటుచేసిన భద్రగిరి మార్ట్ లో ఆర్గానిక్ నిత్యవసర సరుకులతో పాటు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లకు డిమాండ్ ఎక్కువ ఉన్నందున మహిళలు తయారు చేస్తున్న బిస్కెట్లలో ఎటువంటి మూడు సరుకులు వాడుతున్నారో పరిశీలించి వారికి కొన్ని సూచనలు సలహాలు అందిస్తూ బిస్కెట్ల తయారీలో ఎటువంటి కల్తీ లేని ముడి సరుకులు వాడకూడదని, స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం తప్పనిసరిగా వాడాలని, భద్రగిరి మార్టులో కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చినచో మీ యొక్క ఏజెన్సీని రద్దు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పివిటిజి అధికారి గన్యా, మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేసే మహిళలు వెంకటలక్ష్మి, లలిత, సమ్మక్క, మంగ వేణి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు