కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు….

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 14
టుడే 9 ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాలుగవ రోజు అధ్యాపకుల అభివృద్ధి కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ (సీపిడీసీ) సమావేశం, పూర్వ విద్యార్థుల సమావేశం, తల్లిదండ్రుల సమావేశం జిజ్ఞాస ప్రైజ్ విజేతల అభినందన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అన్నారు.
గురువారం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బూసిరెడ్డి శంకర్ రెడ్డి. తోటమళ్ల బాలయోగి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీపిడీసీ సభ్యులైన బూసిరెడ్డి శంకర్ రెడ్డి.తోటమళ్ల బాలయోగి కళాశాల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధి కోసం వారు చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని అన్నారు.
అలాగే కళాశాల విద్యార్థులు సాధించిన గోల్డ్ మెడల్స్ కళాశాలకు గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించేలా కళాశాల తరఫున పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కవిత్వం చదివిన ప్రథమ సంవత్సరం విద్యార్థిని రమ్యను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె ప్రతిభను కొనియాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశంలో కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులను కోరారు. కళాశాల పురోగతికి పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని వక్తలు పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, కళాశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బూసిరెడ్డి శంకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కళాశాల సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది విద్యార్థులు కళాశాలలో చేరేలా కృషి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా తోటమళ్ల బాలయోగి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించి, విద్యా రంగంలో ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కాంతారావు వి. కామేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు