గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్ల చేస్తన్న వారి పై డీఎస్పీ, సీఐలకు పిర్యాదు….

 

భద్రాచలం జూన్ 2
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, ప్రజలను బెదిరిస్తున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ ఆధ్వర్యంలో నేడు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ కి. భద్రాచలం సీఐ నాగరాజు.కి ఫిర్యాదు పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కుంజా సంతోష్ మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర క్షేత్రమని, ఈ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ వ్యవహారాల వెనుక ఉన్న వ్యక్తులు, ముఠాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసు అధికారులను కోరినట్లు తెలిపారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతలు మరియు భద్రాచలం క్షేత్ర గౌరవాన్ని పరిరక్షించే దిశగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, నిడదవోలు నాగబాబు, ముత్యాల శ్రీనివాస్, బోడ సత్యనారాయణ, సవలం వంశీ, ధర్మ జాగరణ – గోరక్షక సభ్యులు సుబ్రమణ్యం, సిద్ధార్థ, పృథ్వీ, పూర్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు