హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనం సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక మూడు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట ఓ బొమ్మల దుకాణంలో ప్రారంభమైన మంటలు, పక్కనే ఉన్న ‘KSR ఫ్యాషన్స్’ అనే బట్టల దుకాణానికి అంటుకోవడంతో ఒక్కసారిగా ఉధృతంగా మారాయి. బట్టల దుకాణం కావడంతో మంటలు క్షణాల్లో భవనం మొత్తం నిలువెల్లా వ్యాపించి, చుట్టుపక్కల ఉన్న దుకాణాలను అగ్నికి ఆహుతి చేశాయి.
ఈ ప్రమాద ధాటికి భవనంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్, సెల్ ఫోన్ షాపులతో సహా మొత్తం 20కి పైగా దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురై, తమ షాపుల్లోని విలువైన వస్తువులను తీసుకొని ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. మండే ఎండల తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో, వాటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సైతం మొదట్లో కష్టతరంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ, మంటల వల్ల అమీర్‌పేట పరిసర ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో, పోలీసులు అ









