పాఠశాలల పనితీరుపై హెచ్ఎం వార్డెన్ లతో ప్రత్యేక సమావేశం…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జులై 20
టుడే 9 ప్రతినిధి

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు మంచి విద్యాబోధనతోపాటు వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రతి ఇన్స్టిట్యూషన్లో సోమవారం నాటికి 100% పిల్లలు హాజరుకావాలని నిర్లక్ష్యం వహించే హెచ్ఎం వార్డెన్ ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శనివారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే హెచ్ఎం వార్డెన్ లతో పాఠశాలల పనితీరు. పాఠశాలల్లో కల్పించవలసిన మౌలిక వసతుల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని పిల్లలు ,సైన్స్ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారని సంబంధిత హెచ్ఎం ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అలాగే దసరా సెలవులు అయిపోయిన తర్వాత వందరోజుల యాక్షన్ ప్లాన్ తయారుచేసి అమలు చేస్తామని అందుకు హెచ్ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

విధినిర్వహణలో అశ్రద్ధ వహించే వార్డెన్లు. ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సరైన సమాధానం రాయడం లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనికిరాని పురాతన భవనాలు ఏమైనా ఉంటే వెంటనే ఐ టి డి ఏ ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేసి ఆ భవనాలు కూల్చివేయాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందున పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అన్ని డిసిజనులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే విద్యార్థినీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి పాఠశాలలో మెడికల్ కిట్లు సరఫరా చేసామని సంబంధిత ఏఎన్ఎంలు 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండి వైద్య చికిత్సలు అందించాలని, ఎవరైనా పిల్లలు రెండు మూడు రోజులు అస్వస్థతతో బాధపడితే వెంటనే దగ్గరలో ఉన్న పి హెచ్ సి కి తీసుకెళ్లి వైద్యం చేయించాలని ఈ విషయాన్ని వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.

ప్రతి ఇన్స్టిట్యూషన్లో తప్పనిసరిగా మెనూ పాటించి నాణ్యమైన భోజనం విద్యార్థిని విద్యార్థులకు అందించాలని, జిసిసి వారు సప్లై చేసే బియ్యం ఇతర సామాగ్రి నాసిరకంగా ఉంటే వెంటనే వాపస్ చేయాలని అన్నారు. గవర్నర్ నుంచి మొదలుకొని సీఎం. మంత్రులు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విద్యపై దృష్టి పెట్టినందున తప్పనిసరిగా వినోద్ తో పాటు నోట్ బుక్స్ యూనిఫామ్ టెస్ట్ బుక్స్ పిల్లలకు సరఫరా చేయాలని అలాగే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, సబ్జెక్టుల పరంగా విద్యార్థులు ఎవరైనా వెనకబడి ఉంటే ఇప్పటినుండే వారిపై దృష్టి సారించాలని, 220 జిపి స్కూల్స్ మరియు 50 ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టినందున చాలా వరకు విద్యార్థిని, విద్యార్థులు బేసిక్స్ చాలా వరకు మెరుగుపడ్డట్టు గమనించానని, పిల్లలందరూ బేసిక్స్, చదవడం రాయడం ఉద్దీపకం వర్క్ బుక్ పూర్తిస్థాయిలో విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు గణితం సబ్జెక్టులలో అన్ని పదాలు సులభంగా రాయగలుగుతున్నారని అదేవిధంగా ఈ సంవత్సరం నాలుగు ఐదు తరగతులకు ప్రత్యేకంగా ఉద్దీపకం వర్క్ బుక్ తయారు చేస్తున్నామని అలాగే 7 8 9 విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేకంగా బుక్స్ తయారు చేస్తున్నామని అన్నారు.

గత సంవత్సరం మన పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కెరీర్ గైడెన్స్ పై నెలకు రెండుసార్లు తప్పనిసరిగా మీ పాఠశాలలో ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, ప్రతి టీచర్ అయిదుగురు పిల్లలను ఎంచుకొని వారికి కెరీర్ గైడెన్స్ పై ప్రతినెల రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మన పాఠశాలల్లో పిడి, పీఈటీలు విద్యార్థినీ విద్యార్థులకు వివిధ క్రీడలపై మంచి తర్ఫీదు ఇచ్చి వారికి నచ్చిన క్రీడలలో పాల్గొనేలా చూడాలని అన్నారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎం.విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి శ్రమదానముతో పాఠశాలలో పరిసరాలు అన్ని శుభ్రంగా చేయించుకోవాలని అవసరమైతే చుట్టుపక్కల పిల్లల తల్లిదండ్రులతో కూడా పండగ వాతావరణం లాగా అందరూ కలిసి చేయాలని, పిల్లలు ఎవరు హెచ్ఎం వార్డెన్ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లకూడదని, తప్పనిసరిగా వాచ్మెన్ పి ఈ టి వార్డెన్ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి జిపిఎస్ పాఠశాలలను కాంప్లెక్స్ హెచ్ఎం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.

ప్రతి పాఠశాలలో న్యూట్రి గార్డెన్ ఇతర పండ్లకు సంబంధించిన మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను తరగతుల వారీగా పిల్లలకు అప్పగించాలని హెచ్ఎం లకు సూచించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి డిక్టేషన్లో ఇవ్వడం జరగదని పూర్తిస్థాయిలో అడ్మిషన్లు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అందుకు ఉపాధ్యాయులు ఎవరు డిప్రెషన్లో కొరకు తన వద్దకు రావద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఖమ్మం డి డి విజయలక్ష్మి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి ఎం జిసిసి సమ్మయ్య, ఏసీఎంఓ రమేష్, ఏటీడీవోలు అశోక్ హెచ్ఎం వార్డెన్ లో డిడి ట్రైబల్ వెల్ఫేర్, పిఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు