గిరిజన మహిళ టైలరింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం : ఆగస్టు 10…
దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, భద్రాద్రి క్రాంతి విలాస్, మండల సమైక్య దుమ్ముగూడెం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన గిరిజన మహిళ టైలరింగ్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. గిరిజన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పోలీస్ శాఖ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.









