అలియా భట్ నిర్మించిన ‘డోంట్ బి షై’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ నటి అలియా భట్ తన సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి ‘డోంట్ బి షై’ చిత్రాన్ని నిర్మించారు. శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అలియా భట్ నటించకపోయినా, నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు.

కొత్త కథలను, కొత్త నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథలో స్నేహం, ప్రేమ, బ్రేకప్, భవిష్యత్తుపై కలలు, కుటుంబ బంధాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే గందరగోళం వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించనున్నారు.

థియేటర్లలో కాకుండా ‘డోంట్ బి షై’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. దీంతో అలియా భట్ నిర్మించిన ఈ కొత్త తరహా కథను ఓటీటీ ప్రేక్షకులు ఎప్పటి నుంచి చూడొచ్చనే ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share