తెలంగాణలో ఇది ప్రజా పాలన కాదు: బీజేపీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కాకుండా పోలీసుల నిర్బంధ పాలన సాగిస్తోందని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమని పేర్కొంది.

రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేసింది.

రాజ్యాంగం, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ ప్రశ్నించింది. జీవో 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share