రూ.52 కోట్ల బకాయిలు.. రైస్ మిల్లుల కూల్చివేత

వనపర్తి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి భారీగా బకాయిలు చెల్లించని రెండు రైస్ మిల్లులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చాముండి, సాంబశివ రైస్ మిల్లులను శనివారం బుల్డోజర్లతో కూల్చివేశారు.

సాంబశివ రైస్ మిల్ ప్రభుత్వానికి రూ.13 కోట్లకు పైగా, చాముండి రైస్ మిల్ రూ.39 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు మిల్లులపై చర్యలు తీసుకుని, మొత్తం రూ.52 కోట్లకు పైగా ఉన్న సివిల్ సప్లై బకాయిల వసూలుకు చర్యలు వేగవంతం చేశారు.

సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ బకాయిలు చెల్లించకుండా, అనుమతులు లేకుండా మిల్లులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ కూల్చివేతల ద్వారా అధికారులు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share